ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక సర్వేలు దర్శనమిస్తున్నాయి. వీటిలో కొన్ని ఓటర్లను తప్పు దారి పట్టిస్తుండటంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వస్తోందంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పేరుతో ఓ సర్వే యూట్యూబ్‌లో హల్ చల్ చేసింది. దీనిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో భాగంగా ఈ వార్తను రూపొందించిన టీఎఫ్ఎసీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విచారణలో ఇతనికి సర్వే విషయాన్ని వాట్సాప్ ద్వారా కోటేశ్వరరావు అనే వ్యక్తి పంపినట్లుగా తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఇతను టీడీపీ నేతలకు అత్యంత సన్నిహితుడుగా పోలీసులు భావిస్తున్నారు. కోటేశ్వరరావును పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని టీఎఫ్ఎసీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నేతృత్వంలో ఈ కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టొద్దు.. జగన్ పై పురందేశ్వరి ఫైర్!