తిరుమల డిక్లరేషన్ విషయంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్షీపార్వతి ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్లంతా పని పాట లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ పేరుతో అనవసరంగా ప్రభుత్వంపై, సీఎంపై బురద జల్లుతున్నారన్నారు. మతం పేరుతో ప్రజలని రెచ్చగొట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
గతంలో ఇలాగే పాతబస్తీలో అల్లర్లు సృష్టించారని తెలిపారు. కాంగ్రెస్ కల్చర్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారో అలాగే ఇప్పడు మతం పేరుతో రెచ్చగొడుతున్నారన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ కల్చర్ ఇంకా చంద్రబాబుకి పోలేదని విమర్శించారు. ఇప్పుడు టీటీడీ విషయంలో బీజేపీ, టీడీపీ నేతలు అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.