telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గోపీచంద్ తో స్టెప్పులేయనున్న ఆర్జీవీ హీరోయిన్…

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్తగా పరిచయం చేసిన హాట్ బ్యూటీ అప్సరరాణి . ఈ వయ్యారితో ‘ థ్రిల్లర్’అనే సినిమా తెరకెక్కించాడు. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారని చెప్పాలి . అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాటపడని ఈ కుర్రది ఆ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఆతర్వాత ఈ భామ తోనే ‘డేంజర్’ అనే ‘లెస్బియన్’ సినిమా కూడా తెరకెక్కిస్తున్నాడు వర్మ. అంతలా వర్మను ఆకర్షించింది అప్సరరాణి. తాజాగా భామ మాస్ మహారాజా రవితేజతో క్రాక్ సినిమాలో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హీరోతో చిందేయడానికి సిద్ధమైపోయింది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా రానున్న సినిమా సీటీమార్. ఇక ఈ సినిమాలో అప్సరరాణి ఐటెం సాంగ్ లో నటిస్తుంది.  ఈ విషయాన్ని సీటీమార్ దర్శకుడు సంపత్ నంది స్వయంగా తెలిపారు. సీటీమార్ సెట్స్‌లోకి పటాక్ రానికి స్వాగతం అంటూ సంపత్ ట్వీట్ చేశారు.. క్రీడా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో చేస్తోంది. అయితే ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts