telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

Pradeep

తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తెలుగు బుల్లితెరలో ఉన్న మేల్ యాంకర్లలో ఇతడి స్థాయే వేరు. యాంకర్‌గా ఉంటూ భారీ ఫాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అతడి యాంకరింగ్ చూడటానికే కొందరు షోలు కూడా చూస్తారనడం అతిశయోక్తేమీ కాదు. అయితే మొట్టమొదటి సారి బుల్లితెర హీరో వెండి తెర పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రదీప్ ఇటీవల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా ప్రదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండు రంగ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ పరిస్థితి విషమించడంతో ఆయన నిన్న సాయంత్రం కన్ను మూశారు. మరోవైపు ప్రదీప్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

Related posts