telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇండియాలో మరోసారి లాక్ డౌన్..ఇవాళ మోడీ అత్యున్నత సమావేశం !

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.. కేసులు  పెరుగుతున్న  నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడి నేతృత్వంలో ఉన్నత స్థాయు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. “కోవిడ్-19” కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆక్సిజన్, మెడిసిన్స్ ( ఔషధాలు) సరఫరాతో పాటు, డాక్టర్లు, ఇతరత్రా మానవ వనరుల కేటాయింపుల పై కూడా ఈ సమీక్షలో చర్చించనున్నారు. దేశంలో రెండవ విడత “కరోనా” విజృంభణలో చనిపోయిన “కోవిడ్-19” రోగుల కుటుంబ సభ్యులతో ఆసుపత్రులు, మార్చురీస్, స్మశానాలు క్రిక్కిరిసి పోతున్నాయి. “కరోనా” వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్ పేరొందినా, కొన్ని రాష్ట్రాలలో వ్యాక్సిన్ కొరత వల్ల దేశంలో “వ్యాక్సినేషన్” ప్రక్రియకు విఘాతం కలుగుతోంది. దేశంలోని ఆరోగ్య రంగం, వ్యవస్థలను యుద్ద ప్రాతిపదికపై బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.  

Related posts