telugu navyamedia
సినిమా వార్తలు

టైమ్స్ “మోస్ట్ డిజైరబుల్ ఉమెన్”గా అలియా భట్

Alia-Bhatt

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ టీనేజ్ లోనే కథానాయికగా తెరపైకి వచ్చేసి యూత్ హృదయాలను దోచేసింది. అటు గ్లామర్ పరంగాను, ఇటు నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకుంది. వరుస అవకాశాలతో పాటు, వరుస విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటోంది ఈ బ్యూటీ. అలాంటి అలియా టైమ్స్ “మోస్ట్ డిజైరబుల్ ఉమెన్”గా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ తెరపై టాప్ హీరోయిన్స్ గా తమ హవాను కొనసాగిస్తున్నవారిని సైతం వెనక్కి నెట్టేసి అలియా ఈ టైటిల్ దక్కించుకోవడం విశేషం. మొత్తం 50 మందితో కూడిన ఈ జాబితాలో అలియా తరువాత స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె, గాయత్రి భరద్వాజ్, అదితీరావు, జాక్విలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాని, అనుకృతి తదితరులు వున్నారు. ప్రస్తుతం అలియా తెలుగులో “ఆర్ఆర్ఆర్”, హిందీలో “బ్రహ్మాస్త్ర”, “సడక్-2” చిత్రాల్లో నటిస్తోంది.

Related posts