telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేటీఆర్ కు టాలీవుడ్ ప్రముఖుల బర్త్ డే విషెస్

KTR

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్‌ తారక్‌.. హ్యాపీ బర్త్‌డే. సహాయం కోసం వేచి చూసే పౌరుల కోసం నిరంతరం మీరు పడే తపన, వ్యక్తిగతంగా చొరవ చూపి వారికి సాయం చేసే తీరు చూసి నాకెంతో సంతోషంగా ఉంటుంది. ప్రజలకు మరింత సేవ చేసేందుకు, మరిన్ని సంవత్సరాల పాటు, ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నా” అంటూ పోస్ట్ చేశారు చిరు. అదే విధంగా పవన్ కళ్యాణ్ “నా సోదరుడు కేటీఆర్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున ఆ చిలుకూరి బాలాజీ మీకు సంపూర్ణ ఆరోగ్యం, సంపద ఇవ్వాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశారు. “హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌. ఇలాగే అందరికీ మీరొక ఉదాహరణగా, ఆదర్శంగా నిలవాలి. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మీకు సంతోషం, మనశ్శాంతి ఇవ్వాలని ఆశిస్తున్నా” అంటూ మహేశ్‌బాబు.”‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌. నిస్వార్థంతో మీరు చేస్తున్న ఈ సేవ మరింత కొనసాగాలని, మరీ ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కువ మందికి చేరాలని కోరుకుంటున్నా” అని రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. ఇక వెంకటేష్ “హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌ గారు. ఈ ఏడాదంతా మీకు సుఖ, సంతోషాలతో గడవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా” అని ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భముగా ఆయన అభిమానులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

Related posts