telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాంఛనంగా ప్రారంభమైన ప్రభాస్ ఆదిపురుష్

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ప్రభాస్ లేకుండానే ఓంరౌత్ ఆదిపురుష్‌ను మొదలు చేయనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులను కూడా మొదలుపెట్టేశాడు. ప్రభాస్ లేనటువంటి సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాల్గొననున్నాడు. దీంతో అతి త్వరలో ఆదిపురుష్ చిత్రీకరణను ప్రారంభించనుంది. అయితే ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడని, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించనున్నాడు. అయితే.. తాజాగా మరో అప్డేట్ వచ్చింది. సలార్ కన్నా ముందు ప్రకటించిన ఆదిపురుష్ నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వార్త విన్న అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అతి త్వరలో ఆదిపురుష్ నుంచి ప్రభాస్ లుక్ వస్తుందని వారు వేచి చూడనున్నారు. ప్రస్తుతం ఈ వార్తతో ఆదిపురుష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Related posts