telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలియాభట్ నిశ్చితార్థం ఈ రోజే..?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రన్‌బీర్ కపూర్, అలియా భట్‌ నేడు నిశ్చితార్థం చేసుకోనున్నారట. ఈ ఆర్ఆర్ఆర్ సీత ప్రియుడిని పెళ్లాడేందుకు సిద్దమవుతుంది. వీరి నిశ్చితార్థం జైపూర్‌లోని రణతంబోర్‌లో జరగనుందని వార్తలు వస్తున్నాయి. దానికి తోడు బాలీవుడ్ కథనాలు హీట్ మరింత పెంచుతున్నాయి. నిన్న ఉదయం రన్‌బీర్ కపూర్, అలియా భట్‌లు రన్‌బీర్ తల్లి నీతు సింగ్‌తో కలిసి జైపూర్ బయలుదెరారు. ఆ తరువాత స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కూడా పింక్ సిటీకి ప్రయాణం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ తరువాత కొన్ని గంటల్లోనే బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా కనిపించారు. మొదట బ్రహ్మస్త్ర సినిమా చిత్రీకరణ కోసం పింక్ సిటీ వెలుతున్నారని అందరూ అనుకున్నారు. కానీ సినీ వర్గాల్లో వస్తున్న వార్తల ప్రకారం మహేష్ భట్, రిద్దిమా కపూర్, కరణ్ జోహార్ వంటి వారు కూడా ఇక్కడి వస్తున్నారని టాక్ ఉంది. గోవాలో ఉన్నవారు ఉదయం జైపూర్ వెళ్లారని వార్తలు వస్తున్నాయి. దాంతో పాటుగా తాజా వార్తల ప్రకారం కుటుంబ సన్నిహితులు అందరూ కలిసి ఎందుకు ఒకే చోట చేరుతారు. కచ్చితంగా రన్‌బీర్, అలియాల నిశ్చితార్థం అయ్యుంటదని అంటున్నారు. మరి దీనిని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. దాంతో పాటుగా వీరు కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్దమవుతోంది. అప్పుడు జంటగా వస్తారని అభిమానులు అంటున్నారు.

Related posts