telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఇయర్‌ ఎండింగ్‌ కేసులు వివరాలను ప్రకటించిన తెలంగాణ డీజీపీ..

mahender_reddy

ఇయర్ ఎండింగ్ స్టేట్ కేసుల వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. కరోనా కష్ట కాలంలో పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేశారని.. గత సంవత్సర కాలంలో మహిళలు, పిల్లల భద్రతకు పెద్ద పీట వేసామని పేర్కొన్నారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 6% క్రైమ్ రేట్ తగ్గిందని… 2020 లో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఎన్కౌంటర్లు జరగగా.. అందులో 11 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. 135 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. మావోల నుంచి ఈ ఏడాది ఒక ఏకే 47 గన్ తో పాటు, మొత్తం 22 ఆయుధాలలు, 3 ల్యాండ్ మైన్స్ , 23 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీల్లో 54 % రికవరీ చేశామని.. మహిళలు పై వేధింపులు గత ఏడాది తో పోలిస్తే 1.92% తగ్గిందన్నారు. అలాగే మర్డర్స్ 8.29% తగ్గాయని.. దోపిడీలు 28.57%, రాబరీ 33.11%, చైన్ స్నాచింగ్ 46%
తగ్గాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు 13.93%, మరణాలు 9% తగ్గాయని తెలిపారు. గత ఏడాది కన్విక్షన్ రేటు 29.4 % ఉంటే ఈ ఏడాది 48.5% పెరిగిందని… రాష్ట్ర వ్యాప్తంగా 2020లో 99,095 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సిసి కెమెరాలు ద్వారా 4490 కేసులు ఛేదించామని… జీరో FiR కింద 624 కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. ఇక పీడీ యాక్ట్ కేసులో 350 మందిని జైళ్లకు పంపామన్నారు. అలాగే షీ టీమ్స్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 4855 ఫిర్యాదులు రాగా, 567 FIR లు నమోదు చేశామని తెలిపారు. ఈ ఏడాది యాక్సిడెంట్ లు 16866 చోటు చేసుకున్నాయని…ఇందులో 5821 మంది చనిపోగా… 16591 మంది క్షతగాత్రులు అయ్యారని పేర్కొన్నారు. అలాగే… ఎంవీయాక్ట్ కింద కోటి 67 లక్షల 98 వేల కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Related posts