telugu navyamedia
సినిమా వార్తలు

రామ్ గోపాల్ వర్మకు షాక్.. చీటింగ్‌ కేసు నమోదు..

వివాదాలకు కేరాఫ్​ అయిన డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ మరో సారి వార్తల్లోకెక్కాడు. ఎప్పుడూ త‌న ట్వీట్స్‌, ఇంట‌ర్వ్యూస్‌లో చేసే కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ప‌డ్డాడు.

తాజాగా ఆయనపై పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని కొప్పాడ శేఖర్ రాజు ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2019లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్ కూడా చేశారు. ఈ య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వ‌ర్మ ‘ఆశ ఎన్‌కౌంట‌ర్’ అనే సినిమాను తెరకెక్కించారు.. పలు వివాదాల మధ్య వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా జనవరిలో రిలీజ్ అయింది.

అయితే ఈ సినిమా నిర్మాణం కోసం తన వద్ద వర్మ రూ.56 లక్షలు డబ్బు తీసుకున్నారని పేర్కొన్నారు. కొన్నాళ్ల క్రితం రమణారెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా రామ్‌ గోపాల్‌ వర్మతో తనకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను వర్మకి జనవరి 2020లో ₹ 8 లక్షలు, కొన్ని రోజుల తర్వాత మరో ₹ 20 లక్షలు, మరోసారి రూ. 28 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు.

ఈ మొత్తాన్ని వర్మ ‘ఆశ’ సినిమా విడుదలకు ముందే తనకి తిరిగి ఇస్తానని హామి ఇచ్చినట్లు తెలిపారు. అయితే వర్మ చెప్పిన సమయం దాటిపోవడం, పైగా ఆ చిత్రానికి వర్మ నిర్మాత కాదని రాజుకు తెలియడంతో అతను మోసపోయినట్లు గ్రహించానని అందుకే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.అంతేకాక తిరిగి డబ్బులు అడిగితే తనని బెదిరిస్తున్నాడని కూడా ఆరోపించాడు.

Related posts