telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఢిల్లీ పోలీస్‌ అధికారి పాటకు అక్షయ్ ఫిదా

Akshay

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ నటించిన “కేసరి” సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోని ‘తేరి మిట్టీ’ సాంగ్‌ ఆల్‌టైమ్‌ హిట్‌గా నిలుస్తుంది. మనోజ్‌ ముంటాసిర్‌ రాసిన ఈ పాటను బీ ప్రాక్‌ ఆలపించాడు. ఇపుడు ఇదే పాటను ఢిల్లీ పోలీస్‌ అధికారి రజత్‌ రాథోడ్‌ వయోలిన్‌ వాయిస్తూ పాడి అదరహో అనిపించారు. తాను పాడిన పాటను రజత్‌రాథోడ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు అక్షయ్ కుమార్ ను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అక్షయ్ ఈ వీడియోపై స్పందించారు. రజత్‌ రాథోడ్‌ పాటకు అక్షయ్‌ కుమార్‌ ఫిదా అయిపోయాడు. “తేరి మిట్టీ” పాట నాకు ఎప్పుడూ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఈ పాటను నేను ఎన్ని సార్లు విన్నానో.. ఈ సారి కూడా ఎలాంటి తేడా లేకుండా పాడి షేర్‌ చేసిన రజత్‌ రాథోడ్‌కు కృతజ్ఞతలు” అని అక్షయ్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Related posts