telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐశ్వర్య రాయ్ పై సంచలన వ్యాఖ్యలు… క్షమాపణలు చెప్పిన వివేక్ ఒబెరాయ్

Vivek-Oberai

బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. వివేక్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఒక ఫొటో షేర్ చేశారు. దానిలో “హాహా… క్రియేటివ్స్… నో పాలిటిక్స్… జస్ట్ లైఫ్!” అని రాశారు. ఈ పోస్టు చేసిన వివేక్‌పై పలువురు నటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని తీరుపై మండిపడుతున్నారు. సోనమ్ కపూర్, గుత్తా జ్వాల తరువాత కాంగ్రెస్ నేత, నటి, నార్త్ ముంబై నుంచి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి అయిన ఊర్మిళా మాతోండ్కర్ ఇప్పుడు వివేక్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. “ఇది ఎంతో నీచం. ఇది చాలా చెడ్డ పని. వివేక్ ఓబెరాయ్ చాలా అనుచితమైన పోస్టు చేశారు. మీరు ఒక మహిళను లేదా చిన్న పిల్లను క్షమాపణలు అడగలేకపోయిన పక్షంలో, కనీసం ఆ పోస్టును తొలగించి, గౌరవం నిలబెట్టుకోండి” అని కోరారు.

ఈ వివాదం కాస్త పెద్ద‌దిగా కావ‌డంతో చివ‌ర‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ట్వీట్‌ని డిలీట్ చేశాడు. ఈ ఆదివారం ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెలువ‌డిన నేప‌థ్యంలో ఓ నెటిజ‌న్ స‌ల్మాన్, వివేక్ ఒబేరాయ్, అభిషేక్‌తో ఉన్న ఐష్ ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. సల్మాన్‌-ఐష్‌ ఉన్న ఫొటోపై “ఒపీనియన్‌ పోల్‌” అని, ఐష్‌-వివేక్‌ ఫొటోపై “ఎగ్జిట్‌ పోల్‌‌” అని, ఐష్‌-అభిషేక్‌ ఉన్న ఫొటోపై “ఫలితాలు” అని రాసుంది. దీనికి వివేక్‌ క్యాప్షన్‌గా “హ హ.. క్రియేటివ్‌.. ఇది రాజకీయం కాదు. కేవలం జీవితం” అని రాశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. సోన‌మ్ క‌పూర్, గుత్తా జ్వాలా, మ‌ధుర్ బండార్క‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు వివేక్ చ‌ర్య‌ని త‌ప్పు ప‌ట్టారు. మహారాష్ట్రకు చెందిన మహిళా కమిషన్‌ వివేక్‌పై కేసు కూడా నమోదు చేసింది. ఈ నేప‌థ్యంలో త‌న ట్వీట్‌ని డిలీట్ చేసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు వివేక్.

కొన్ని విష‌యాలు మ‌నకు స‌ర‌దాగా అనిపిస్తాయి. అవి వేరే వాళ్ళ‌కి సీరియ‌స్‌గా ఉంటాయి. గ‌త ప‌దేళ్ళ‌లో రెండు వేల మందికి పైగా పేద ఆడ‌పిల్ల‌ల‌కి అండ‌గా నిలిచాను. నేను మ‌హిళల‌ ప‌ట్ల అగౌర‌వంగా ఉంటాన‌నే మాట‌లు ఊహించ‌లేను. ఎవ‌రో క్రియేట్ చేసిన ఫోటోపై స‌ర‌దాగా రిప్లై ఇవ్వ‌డం వ‌ల‌న ఓ మ‌హిళ బాధ‌ప‌డుంటే క్ష‌మించాల్సిందిగా కోరుతున్నాను. ట్వీట్ కూడా తొల‌గించేసాను అని వివేక్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts