telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రముఖ ప్రజా కవి మృతి.. సీఎం కేసీఆర్‌ దిగ్బ్రాంతి

kcr stand on earlier warning to rtc employees

ప్రజా కవి, రచయిత, పాత్రికేయులు, ఆత్మీయులు దేవిప్రియ ఈరోజు ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. మరి కాసేపట్లో ఆయన మృతదేహం అల్వాల్ లోని ఆయన స్వగృహానికి చేరుకుంటుంది. మధ్యాన్నం ఒంటి గంటకు తిర్మలగిరి స్మశాన వాటిక లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దేవి ప్రియ కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. దేవీప్రియ మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపెందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. దేవీప్రియ సాహిత్య ప్రతభకు ‘గాలి రంగు’ రచన మచ్చు తునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts