అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఇటీవల రథం దగ్దమైన ఘటనపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
దేవాలయాల విషయంలో జరుగుతోన్న అన్ని దారుణాలకు ఆయనే కారణమంటూ ట్వీట్లు చేశారు.వైఎస్ జగనే హిందుత్వంపై ఎక్కుపెట్టిన గన్ అని దుయ్యబట్టారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలు ధ్వంసం చేయించారని అన్నారు.
సింహాద్రి అప్పన్నకి చెందిన 60 వేల కోట్ల రూపాయల విలువ చేసే మాన్సాస్ భూములు మింగి, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగలబెట్టించారు” అని బుద్ధా వెంకన్న ఆరోపించారు. “అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథాన్ని తగలబెట్టించి, తిరుమల వెంకన్న సన్నిధిలో అన్యమత ప్రచారం చేయించారని దుయ్యబట్టారు.
చర్చలు జరపాలని కోర్టు చెబుతుంటే..కేసీఆర్ షరతులు పెడుతున్నారు: వీహెచ్