telugu navyamedia
సినిమా వార్తలు

మజిలీ… 25 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి

Majili

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన “మజిలీ” చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఈ రోజుతో 25 సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఈ పోస్టర్ ద్వారానే కృతజ్ఞతలు తెలిపారు. “మజిలీ” సినిమాకు పోటీగా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటి పోటీని తట్టుకుని ఇన్ని రోజులు థియేటర్లలో రన్ కావడం అనేది విశేషమే. ఇక సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. త్వ‌ర‌లోనే త‌న సొంత బ్యానర్ వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ‌పై ధ‌నుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడు.

Related posts