telugu navyamedia
సినిమా వార్తలు

సూర్య “ఎన్జీకే” ప్రీ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

surya ngk movie teaser

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం “ఎన్జీకే”. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఎస్.ఆర్.ప్రభు నిర్మాణంలో నిర్మితమవుతున్న ఈ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 31న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ – ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

Related posts