telugu navyamedia
సినిమా వార్తలు

ఈ నెలలోనే “భీష్మ” ప్రారంభం

nithin-and-rashmika-mandanna
ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరో నితిన్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. నితిన్ ను హిట్ పలకరించి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి “భీష్మ” అనే టైటిల్ ను, “సింగిల్ ఫరెవర్” అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నితిన్ సరసన కథానాయికగా రష్మిక మందన్న నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. “ఛలో” లాంటి హిట్ సినిమా తరువాత వెంకీ కుడుముల చేస్తోన్న సినిమా ఇది. మరి ఈ చిత్రమైనా నితిన్ కి మంది హిట్ ను ఇవ్వాలని కోరుకుందాం. నితిన్ నటించిన భారీ చిత్రం “శ్రీనివాస కళ్యాణం” గత సంవత్సరం విడుదలైంది. ఈ చిత్రం నితిన్ కు నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు నితిన్ తన ఆశలన్నీ “భీష్మ”పైనే పెట్టుకున్నాడు.

Related posts