telugu navyamedia
సినిమా వార్తలు

“మీ మగబుద్ధే వంకరబుద్ధి”..అదే నిజ‌మ‌న్న బ‌న్నీ

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్‌గా న‌టించిన సినిమా ‘పుష్ప . ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపొందిన ఈచిత్రం నేడు (డిసెంబర్‌17) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై హిట్ టాక్ వ‌స్తోంది.

pushpa review

అలాగే సమంత చేసిన స్పెషల్‌సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అదే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. టాప్ హీరోయిన్ గా ఉన్న స‌మంత తొలిసారిగా చేసిన ఐటెం సాంగ్‌‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంద‌రిని ఆకట్టుకుంది. అయితే పాట లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Samantha Ruth Prabhu's Item Song Debut: Blockbuster!

ఇప్పటికే ఈ పాటను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడులోని పురుషుల సంఘం సైతం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ పాటను తొగించకుంటే పాటకు డ్యాన్స్‌ చేసిన సమంత, పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, గేయ రచయిత వివేకాపై కేసు పెడతామని హెచ్చరించింది.

Stunning pictures of samantha from pushpas oo antava oooo antava song

తాజాగా పుష్ప ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్‌ ఈ కాంట్రవర్సరీపై స్పందించారు. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్‌ బన్నీని ప్రశ్నించగా… ‘లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం’ అంటూ షాకింగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

 

Related posts