telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ప్రియురాలు రియా కాల్ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ హీరో…!

Rhea

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులోని ట్విస్టులు సస్పెన్సు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో రియా చక్రవర్తి కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాల్‌ లిస్ట్‌కు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ ఒకటి రియా కాల్ లిస్ట్ ను సంపాదించి.. ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలతో రియా చక్రవర్తి టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. రియా కాల్ లిస్ట్ లో టాలీవుడ్ హీరో కూడా ఉన్నాడు. రానాకి రియా 7 సార్లు కాల్ చేయగా.. రానా 4 సార్లు ఆమెకు కాల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ తో కూడా రియా మాట్లాడింది. రియా సీడీఆర్ లిస్ట్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ కి ఆమె 30 సార్లు కాల్ చేయగా.. రకుల్ ఆమెకు 14 సార్లు కాల్ చేసింది. వీరి మధ్య టెక్స్ట్ మెసేజ్ సంభాషణ కూడా జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడికి చెందిన ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర డివైస్‌లను ఈడీ సీజ్ చేసింది. సుశాంత్ అకౌంట్లలో ఉన్న రూ.15 కోట్లు ఏమైపోయాయి అనే నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పలుసార్లు రియా, ఆమె సోదరుడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మరోవైపు సుశాంత్ సింగ్ మృతిపై ఆయన తండ్రి రియాపై బీహార్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పాట్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్న సుశాంత్ కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంను ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టులో గురువారం వరకు విచారణను వాయిదా వేసింది. అన్ని వర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును గురువారానికి రిజర్వ్ చేసింది.

Related posts