telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఒక బీరుకు .. రూ.73 లక్షలా ..

Beers supply stopped from liqur depo

అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద చిక్కే తెచ్చిపెడుతుంటాయి. అలాంటి అనుభవం అందరికి ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది కూడా.. అయితే అది మరీ షాకింగ్ గా ఉంటె ఎదుటి వ్యక్తి తట్టుకోగలడోలేదో అనేది ఈ మొత్తం పరిస్థితిని మార్చేస్తుంది. తాజాగా ఇలాంటి అనుభవమే ఒక జర్నలిస్ట్ కి జరిగింది. ఒక్క బీరు తాగితే, హోటల్ యాజమాన్యం 73 లక్షల బిల్లు వేసింది. బిల్లు చూసి ఎవరు మాత్రం షాక్ అవరు..తేరుకున్నాక అది బిల్లు అమౌంట్ లో ఒక అంకె ఎక్కువ నొక్కేసరికే అది కాస్తా లక్షలై కూర్చుంది. అసలిదంతా హోటల్‌లోని ఓ ఉద్యోగి తప్పిదం వల్ల జరిగింది.వివరాలలోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఓ జర్నలిస్టుకు ఈ అనుభవం ఎదురైంది. బాధితుడు ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేయడంతో ఇది వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రీడా జర్నలిస్టు పీటర్‌ లేలర్‌.. మాంచెస్టర్‌లోని మాల్‌మైసన్‌ అనే హోటల్‌కు వెళ్లారు. ఒక బీరు ఆర్డరిచ్చారు. తనకు అమెరికాకు చెందిన బ్రాండ్లు వద్దని చెప్పడంతో బ్రిటన్‌కు చెందిన బ్రాండ్‌ డ్యూచర్స్‌ ఐపీఏను సర్వ్‌ చేశారు.

బీరు తాగడం ముగిశాక బిల్లు చెల్లింపు కోసం పీటర్‌ తన కార్డు ఇచ్చాడు. ఉద్యోగిని బిల్లు చెల్లింపు కోసం స్వైప్‌ చేసుకొని కార్డు తిరిగివ్వబోతూ ఉండగా.. బీరు ఖరీదెంతయింది? అని పీటర్‌ అడిగాడు. క్షణంలో ఆమె కంగారు పడిపోయి, వెంటనే మేనేజర్‌ వద్దకు పరుగెత్తింది. బిల్లు చెల్లింపు సమయంలో సదరు ఉద్యోగిని 99,983.64 డాలర్లు (రూ.73,70,226) అని టైప్‌ చేయడంతో ఆ సొమ్ము పీటర్‌ ఖాతా నుంచి హోటల్‌ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీనిపై స్పందించిన మేనేజర్‌ పీటర్‌కు సొమ్ము మొత్తాన్ని రీఫండ్‌ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ తప్పు జరిగినందుకు పీటర్‌కు క్షమాపణలు తెలిపారు. సంబంధిత బ్యాంకును సంప్రదించి, సొమ్ము మొత్తం రీఫండ్‌ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్వైపింగ్‌ యంత్రంలో లోపాల వల్ల ఈ పొరపాటు జరిగి ఉండొచ్చని, ఈ ఘటనపై విచారణ జరుగుతోందని హోటల్‌ వర్గాలు తెలిపాయి. గత జులైలో నటుడు రాహుల్‌ బోస్‌కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. చండీగఢ్‌లోని మారియట్‌ హోటల్‌లో బస చేసిన ఆయన రెండు అరటి పళ్లను ఆర్డర్‌ చేసినందుకు రూ.442.50 బిల్లు వేశారు.

Related posts