హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్స్ . రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రైమ్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్ లో “ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేసి పారిపోయిన కార్తీక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు” అన్న మాటలతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. కార్తీక్ ఒక్కడేనా, లేక ఇద్దరా? ఆ అమ్మాయిలను మోసం చేసి పారిపోయిందెవరు? అనే పాయింట్ ని హైలెట్ చేశారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post
నాకు ఇష్టం లేకపోయినా బెడ్ సీన్ లో నటించా : రాశి ఖన్నా