telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ముదురుతున్న వివాదం..ఏపీ సీఎస్‌కు ఎన్నికల కమిషన్‌ లేఖ

Nimmagadda ramesh

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎలక్షన్ కమిషన్ లేఖ రాశారు. ప్రవర్తనా నియామవళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. పట్టణ, నగర ప్రాంతాలలో ప్రవర్తనా నియామళి అమలులో ఉండదన్న ఎస్ఈసీ… పట్టణ ప్రాంతంలో సభలు నిర్వహించి గ్రామాల ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులు చేపట్టవద్దని పేర్కొంది. ఇటువంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందంటూ హెచ్చరిక చేసింది. ఇది ఇలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించబోమని ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఉద్యోగుల, ప్రభుత్వం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఎన్నికల కమిషన్ కు తాము సహకరించమని తేల్చి చేప్పేశారు ఉద్యోగులు.

Related posts