telugu navyamedia
సినిమా వార్తలు

హాస్పిటల్ పాలైన బాలయ్య హీరోయిన్

Sneha-Ullal

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణకు జంటగా “సింహం” సినిమాలో న‌టించిన హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఇటీవ‌ల ఆస్ప‌త్రి పాలైంది. తీవ్ర‌మైన జ్వ‌రం కారణంగా ఆమె ఆస్ప‌త్రిలో జాయిన్ కావాల్సి వ‌చ్చిందని తెలుస్తోంది. జీవితంలో మొద‌టిసారి ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యాన‌ని సోష‌ల్‌మీడియా ద్వారా తెలియ‌జేసిన స్నేహ చికిత్స తీసుకుంటున్న త‌న ఫోటోల‌ను పోస్ట్ చేసింది. “జీవితంలో మొట్టమొద‌టిసారి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యా. తీవ్ర‌మైన జ్వ‌రం కార‌ణంగా చిక‌త్స కోసం హాస్పిటల్‌లో చేరాల్సి వ‌చ్చింది. చాలా భ‌య‌మేసింది. అయితే నా ఆరోగ్యం ఇప్పుడు కొంచెం మెరుగైంది. వీలైనంత విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. చాలా బోరింగ్‌గా ఉంది. అయితే నాతో నెటిఫ్లిక్స్ ఉంది. అలాగే నా గురించి శ్ర‌ద్ధ తీసుకునే మ‌నుషులు ఉన్నారు” అని స్నేహ పోస్ట్ చేసింది.

Related posts