telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పొలిటికల్ ఎంట్రీపై కంగనా కామెంట్స్

Kangana

బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖులపై, నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలు, కొందరు బాలీవుడ్ ప్రముఖులపై నేరుగా ఆమె చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే కంగనా రనౌత్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే మోదీకి మద్దతిచ్చేలా ఆమె వ్యవహరిస్తోందంటూ ఒక వర్గం ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన కంగనా తన రాజకీయ ప్రవేశం గురించి కంగన వరుస ట్వీట్లు చేసింది. “నాకు రాజకీయాలు కొత్త కాదు. మా కుటుంబం సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంది. మా తాతయ్య వరుసగా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. నేను హీరోయిన్ అయిన కొత్తల్లో కాంగ్రెస్ నుంచి నాకు ఆఫర్లు వచ్చేవి. ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడిగేవారు. `మణికర్ణిక` తర్వాత బీజేపీ నుంచి కూడా పిలుపు వచ్చింది. కానీ నేను ఓ నటిని. నాకు నా పనంటేనే ఎక్కువ ఇష్టం. నేను రాజకీయాల గురించి ఎక్కువ ఆలోచించను. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిత్వమున్న నేను నాకు నచ్చిన వ్యక్తికి మద్దతుగా మాట్లాడతాను. అంత మాత్రాన నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని కాదు” అంటూ కంగనా చెప్పుకొచ్చింది.

Related posts