telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జబర్దస్త్” అవినాష్ ఓ ఇంటివాడయ్యాడు…!

Avinash

బుల్లితెరపై పాపులర్ అయిన “జబర్దస్త్” కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతగానో ప్రజాదరణ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రేటింగ్స్ విషయంలో కూడా జబర్దస్త్ ఎప్పుడూ అందనంత ఎత్తులోనే ఉంటుంది. ఎన్ని ఏళ్లు అయినా ‘జబర్దస్త్’ తన సత్తా చాటుతూనే ఉంది. ఇటీవలే మెగాజడ్జ్ నాగబాబుతో పాటు కొందరు కమెడియన్లు నిష్క్రమించినా..’జబర్దస్త్’లో నవ్వులకు లోటు రాలేదు. ఎంతో మంది కమెడియన్లకు తమ టాలెంట్ ప్రదర్శిచేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికైంది. చాలా మంది ఇళ్ళతో పాటు కార్లు కూడా కొనుక్కున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరిపోయాడు మాస్ అవినాస్. ఓవైపు జబర్ధస్త్ కార్యక్రమం మరోవైపు ఆ షో ఫేమ్ ద్వారా వచ్చే ఈవెంట్లు ద్వారా చేతినిండా సంపాదన ఉండటంతో ఈ స్టేజ్ కమెడియన్లు అందరూ ఇళ్లు కొనుక్కుంటున్నారు. ఓ చిన్న ఛాన్స్‌తో స్టార్టయి..ముందు కంటెస్టెంట్స్‌గా రాణించి, ఆ తర్వాత తన ఫ్రెండ్ కార్తీక్‌తో కలిసి ఇప్పడు ఓ టీమ్‌కే సారథ్యం వహిస్తున్నాడు అవినాశ్. మిమిక్రీ.. అవినాశ్‌కు అన్నం పెడితే..జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది. ఇక ఎక్కడికి వెళ్లినా మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ ఉండనే ఉంటుంది. దీంతో ఇతగాడి కామెడీకి అడ్డు లేకుండా పోయింది. టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు లైవ్ సిట్యువేషన్‌కి తగిన జోక్స్ ఈ కమెడియన్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇకపై అమ్మ, నాన్నలతో కలిసి మణికొండలో కొన్న ఇంట్లో ఉండబోతున్నాడు అవినాశ్. వారి కలలను నెరవేర్చినందుకు ఆనందంలో తబ్బుబ్బిపోతున్నాడు. ఇకపై సినిమాలపై ఫోకస్ కూడా పెడతానని చెబుతున్నాడు.

Related posts