telugu navyamedia
సినిమా వార్తలు

“విశాల్ 31” అప్​డేట్​ వచ్చేసింది..

కోలీవుడ్​ హీరో విశాల్ కొత్త సినిమాపై అప్​డేట్​ వచ్చేసింది. పా శరవణన్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న విశాల్​ 31వ సినిమా టైటిల్​, ఫస్ట్​లుక్​ ఆదివారం విడుదల చేయనున్నట్లు​ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను షేర్​ చేశారు.

tollywood movie updates

ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “విశాల్31” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. రేపు “విశాల్ 31” ఫస్ట్ లుక్, టైటిల్ ను వెల్లడిస్తామని ప్రకటించిన మేకర్స్ టైంను మాత్రం తెలపలేదు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అనౌన్స్ చేస్తూ విశాల్ స్వయంగా పోస్టర్‌ని విడుదల చేశారు. పా శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

Last schedule of Vishal 31' to begin from tomorrow | Tamil Movie News - Times of India

కాగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా సెట్లోనే విశాల్ కు గాయమైంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ గాయం కారణంగా విశాల్ కు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో కొన్ని రోజులు “విశాల్ 31” షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో విశాల్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు.

Related posts