దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపాయి బీహార్ ఎన్నికలు. వాటికి సంబంధించిన ఫలితాల కౌంటింగ్ నిన్న ముగిసింది. అందులో ఎంతో మహామహుల అంచనాలను తారుమారు చేస్తూ బీహార్‌లో ఎన్‌డీఏ విజయ పతాకం ఎగురవేసింది. అయితే రాష్ట్రంలో పార్టీ విజయం సాధించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. అందులో రాష్ట్ర ప్రజలకు ఎంతో అభినందనలంటూ మాట్లాడారు. అయితే బీజేపీ కేవలం బీహార్‌లోనే కాకుండా మరి కొన్ని ప్రదేశాలలో గెలుపును సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో 28 సీట్లకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 19 సీట్లను గెలిచి, తన ప్రభుత్వాన్ని స్థాపించింది. అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 7 సీట్లకు గానూ 6 గెలిచింది. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా మోదీ ప్రజలకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ కరోనా సమయంలోనూ వచ్చి ఓట్లు వేసినందుకు, పార్టీపై ఎనలేని నమ్మకాన్ని చూపినందుకు మేము ఎంతో కృతజ్ఞులం అంటూ మాట్లాడారు. మాకు ఇంతటి హోదాని అందించారు. అంతేకాకుండా ప్రజలకు, బీజేపీకి మధ్య సంబంధం ఎవరూ విడగొట్టలేనిదని స్పష్టం చేసారు.
previous post