telugu navyamedia
సినిమా వార్తలు

సిగ్గు లేకుండా వైసీపీలో జాయిన్ అయ్యారు ఛీఛీ… : శ్రీరెడ్డి

Srireddy-and-jivitha-rajasekhar

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్, ఆయన భార్య జీవిత ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లుగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ దంపతులిద్దరూ తాజాగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గతంలో జగన్ తో వీరిద్దరూ సి హల సన్నిహితంగా ఉండేవారు. కానీ వైఎస్సార్సీపీ పార్టీలో నుంచి బయటకు వచ్చి, జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరడం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి రాజశేఖర్, జీవిత టీడీపీలో చేరతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.

ఇదిలా ఉండగా… జీవిత, రాజశేఖర్ లు ఇప్పుడు వైసిపిలో చేరడంపై మండిపడుతోంది శ్రీరెడ్డి. గతకొంతకాలంగా శ్రీరెడ్డికి, జీవితకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో శ్రీరెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా జీవితపై విరుచుకుపడుతోంది. “మా” ఎలక్షన్స్ లో కూడా జీవిత, రాజశేఖర్ లకు సపోర్ట్ చేసిన నాగబాబుపై తనదైన శైలిలో ఫైర్ అయ్యింది ఈ ఫైర్ బ్రాండ్. తాజాగా రాజశేఖర్, జీవితలను ”ఆంద్రజ్యోతి ఆర్కే షోలో జగన్ మంచోడు కాదు, గౌరవం ఇవ్వడు, అతను దొంగ.. లక్షకోట్లు కొట్టేశాడు. వాళ్ల నాన్న చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి అవుదామని తెగప్రయత్నించాడని దొంగ ఏడుపులు ఏడ్చిన వాళ్లు మళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీలో జాయిన్ అయ్యారు. ఛీ.. ఛీ” అంటూ తన ఖాతాలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.

Related posts