అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలై థియేటర్స్‌లో దుమ్మురేపుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్లలో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు.
ఈ క్రమంలో పుష్ప మూవీ చూసేందుకు భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌కు వచ్చాడు అల్లు అర్జున్. అక్కడ బన్నీని చూడగానే ఫ్యాన్స్ అంతా మరింత రచ్చ చేశారు.
అక్కడ ప్రేక్షకులకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. బన్నీతో సెల్ఫీ దిగేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. అల్లు అర్జున్‌పై పూలు చల్లుతూ ‘తగ్గేదే లే’ అంటూ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు.
దీంతో పోలీసుల భారీ భద్రత మధ్య అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లోపలికి వెళ్ళి అభిమానులతో కలిసి సినిమా ను వీక్షించారు.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అంతకుముందు..థియేటర్ కు రావడంతో పుష్పరాజ్ గెటప్ లో ఓ అభిమాని బన్నీ ఉన్న కారును గుమ్మడికాయతో దృష్టి తీసాడు. దీంతో బన్నీ గెటప్‌లో ఉన్న అభిమానితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు అక్కడ ఉన్న వారంతా..దీంతో అక్కడ సందడి మొదలైంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్ లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అవెంజర్స్ గురించి జేమ్స్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు