telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్న టాలీవుడ్ నటుడు

charan-deep

ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి నటుడిగా ఎదుగుతోన్న చరణ్‌దీప్.. తమిళం, కన్నడ సినిమాల్లోనూ బిజీ ఆర్టిస్టుగా మారాడు. అయితే, ఈ నటుడు సొంతంగా ఆన్‌లైన్ బిజినెస్‌ను ప్రారంభించారు. ‘జస్ట్ హాప్’ అనే యాప్‌ ద్వారా ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్నాడు. ‘జస్ట్ హాప్’ యాప్ ద్వారా వినియోగదారులకు కావాల్సిన నిత్యావసరాలు, వంట సరుకులు, పండ్లు, పాలు, పెరుగుతో పాటు చికెన్, మటన్, చేపలు వంటి నాన్‌వెజ్ ఉత్పత్తులను కూడా డోర్‌ డెలివరీ చేస్తున్నారు. దీని కోసం వినియోగదారులు చేయాల్సిందల్లా ‘జస్ట్ హాప్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాని ద్వారా ఆర్డర్ చేసుకోవడమే. ఈ యాప్‌‌ను ప్రారంభించిన కొద్దికాలంలోనే 10వేల విశ్వసనీయ వినియోగదారులను సొంతం చేసుకున్నారు. నిజానికి ఈ యాప్‌ను ప్రారంభించి ఇంచుమించుగా ఏడాది అవుతోంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం లాక్‌డౌన్ పీరియడ్ నడుస్తోంది. ఈ సమయంలో తన యాప్ ద్వారా సేవలను మరింత విస్తృతం చేయాలని చరణ్‌దీప్ నిర్ణయించారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, మణికొండ, బాలానగర్, చింతల్, షాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ యాప్ ద్వారా నిత్యావసరాలను హోం డెలివరీ చేస్తున్నారు. మరిన్ని ఏరియాల్లో సేవలను అందుబాటులోకి తేనున్నట్టు చరణ్‌దీప్ తెలిపాడు. ఇతర ఆన్‌లైన్ స్టోర్లతో పోలిస్తే మేం తక్కువ ధరలకే నిత్యావసరాలను అందిస్తున్నాం. ప్రతిరోజూ కొత్త డిస్కౌంట్లను అందుబాటులోకి తెస్తున్నాం. అని చరణ్‌దీప్ వెల్లడించాడు.

Related posts