telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలా ఎందుకు చుపించానో … అసలు కారణం చెప్పిన జక్కన్న..!

RRR

ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో వీరిద్దరి ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ ఉగాది రోజున విడుదల కాగా.. అందులో నీరులా ఎన్టీఆర్, నిప్పులా చెర్రీని చూపించారు రాజమౌళి. ఆలా ఎందుకు చుపించారనే ప్రశ్న ఇటీవల రాజమౌళికి ఎదురైంది. ఈ ప్రశ్నపై స్పందించిన జక్కన్న.. దానికి గల అసలు కారణాన్ని వివరించారు. నీరు, నిప్పు రెండూ వ్యతిరేక అంశాలు. ఒకదాన్ని మరోకటి నాశనం చేయగలదు. కానీ అవి రెండు కలిసి ఆవిరిగా మారి ఉత్పత్తి చేయబడిన శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది అని రాజమౌళి తెలిపారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఇద్దరు కలిసి బ్రిటీష్ వారిపై యుద్ధం చేస్తారని ఆయన పేర్కొన్నారు. నిజజీవితంలో ఎన్టీఆర్, చెర్రీ ఇద్దరు మంచి స్నేహితులని.. స్టోరీని చెప్పిన తరువాత ఒక్క నిమిషం కూడా తీసుకోకుండానే వారిద్దరు ఓకే చెప్పారని రాజమౌళి పేర్కొన్నారు.

Related posts