రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఉద్యమంలా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన దర్శకుడు శ్రీను వైట్ల బుధవారం హైదరాబాద్, జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ‘‘గత మూడు దశాబ్దాల్లో రాజకీయ నాయకుల నుంచి సమాజానికి ఉపయోగపడే ఇంతమంచి మానవీయ కార్యక్రమాన్ని చూడలేదు. మొదటిసారిగా జోగినిపల్లి సంతోష్ గారు తన గొప్ప మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి రూపకల్పన చేసి నిరంతరం ముందుకు తీసుకుపోతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తనవంతు బాధ్యతగా టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్, నటుడు – సమాజ సేవకుడు సోనూ సూద్, టాలీవుడ్ యంగ్ హీరో విష్ణు మంచు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ప్రముఖ రచయిత గోపీ మోహన్‌ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్టు శ్రీను వైట్ల తెలియజేసారు.
It’s great feeling to plant trees especially during this beautiful rain.. thank you for the nominating me @ganeshbandla and to @MPsantoshtrs garu for starting this initiative 🙏🏻 pic.twitter.com/HlXmCO2r3T
— Sreenu Vaitla (@SreenuVaitla) July 29, 2020