telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టిక్‌టాక్‌ యువతికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన వర్మ

Ram-Gopal-Varma

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా వర్మ ఓ యువతికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. తన ట్విటర్‌ అకౌంట్‌లో ఆ యువతి టిక్‌టాక్‌ వీడియోను పోస్ట్‌ చేసిన వర్మ.. ఆమెకు నటనపై ఆసక్తి ఉంటే [email protected] కు వివరాలు పంపాల్సిందిగా తెలిపారు. కాగా, @aquagirlak టిక్‌టాక్‌ ఐడీ పేరిట పోస్ట్‌ అయిన ఆ వీడియోలో ఓ యువతి.. గతంలో రామ్‌గోపాల్‌ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన చిన్న బిట్‌ను డబ్‌ స్మాష్‌ చేసింది. దీనికి ఫిదా అయిన వర్మ ఆమెకు నటనపై ఆమెకు ఇష్టం ఉంటే వివరాలు పంపాల్సిందిగా కోరాడు. వర్మ కాంట్రావర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Related posts