telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ నా కొడుకు… అనుష్క కామెంట్స్ వైరల్

Anushka

స్టార్ హీరోయిన్ అనుష్క, ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో.. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ క్రాస్ ఓవర్ మూవీ ‘నిశ్శబ్దం’. ఈ చిత్రంలో సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడిసన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ చేపడుతుంది టీమ్. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్‌కు అనుష్క వెళ్లింది. ఆ కార్యక్రమంలో భాగంగా సుమ, ప్రభాస్ ఫోటో చూపిస్తూ.. ఒక పాజిటివ్ పాయింట్ చెప్పమంటే.. అనుష్క వెంటనే ‘నా కొడుకు గురించా?’ అనేసింది. అంతేకాదు ప్రభాస్ మనుషులంటే చాలా చాలా ఇష్టముండే వ్యక్తి అని చెప్పింది. సుమ ‘మీ ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కదా’అనగా… వెంటనే అనుష్క ‘నా కొడుకు కదండీ’ అంటూ పంచ్ పేల్చింది. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పమంటే.. ‘అమరేంద్ర బాహుబలి క్వాలిటీసే వచ్చాయి కదా కొడుకుకి’ అని సమాధానమివ్వగా అందరూ అనుష్క సెన్సాఫ్ హ్యూమర్‌కు ఫిదా అయిపోయారు. అనుష్కతో పాటు సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, దర్శకుడు హేమంత్ పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts