telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

చంద్రయాన్ ఫోటోలు విడుదల చేసిన .. ఇస్రో

isro released chandrayan photos

ఇస్రో చంద్రయాన్‌-2 ప్రయోగం కోసం పనులు వేగంగా పూర్తిచేస్తుంది. బెంగుళూరు శాటిలైట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ సెంటర్‌లో చంద్రయాన్‌-2 కు సంబంధించిన పరికరాలు సిద్ధం అవుతున్నాయి. చంద్రయాన్‌-2కు చెందిన ఫోటోలను ఇవాళ ఇస్రో రిలీజ్ చేసింది. జూలై 9 నుంచి 16 మధ్య చంద్రయాన్‌-2 మిషన్‌ను ప్రయోగించనున్నారు. 2019 సెప్టెంబర్ 6న అది చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్బిటార్‌, ల్యాండర్‌(విక్రమ్‌), రోవర్‌(ప్రజ్ఞన) మాడ్యూళ్లను చంద్రయాన్‌2 ద్వారా లాంచ్ చేయనున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా ప్రయోగం జరుగుతుంది.

ఆర్బిటార్ ప్రొపల్‌షన్ మాడ్యూల్ ద్వారా మూన్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండర్ వేరుపడుతుంది. చంద్రుడిపైన ఉన్న దక్షిణ ద్రువంలో ల్యాండర్ దిగుతుంది. ఇక శాస్త్రీయ పరీక్షల కోసం రోవర్ అక్కడ సంచరిస్తుంది. ల్యాండర్‌, ఆర్బిటార్ మాడ్యుళ్లలో పరికరాలను శాస్త్రవేత్తలు బిగించారు. చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా 11 పేలోడ్స్ కూడా తీసుకువెళ్లనున్నారు. ఇందులో ఇండియాకు చెందినవి ఆరు, యూరోప్‌వి మూడు, అమెరికావి రెండు ఉంటాయి. 2009లో చంద్రయాన్ 1ను ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే.

Related posts