telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటక : … వేటుకు గురైన ఎమ్మెల్యేల వినతి.. ఉపఎన్నికలలో పాల్గొనే అవకాశం కావాలట..

supreme court rejected pitition of 17 karnataka mla's

రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు అను మతి కోరిన అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌ను ఈ నెల 25న విచారించనున్నట్లు ఎన్‌వి రమణ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. 26న అనర్హతకు గురైన కాంగ్రెస్‌కు చెందిన ఎంఎల్‌ఎల వాదనలు వింటారని వారి తరపు న్యాయవాది తెలిపారు. అప్పటి స్పీకర్‌ కెఆర్‌ రమేష్‌ కుమార్‌ జారీచేసిన అనర్హత ఉత్తర్వుల ప్రకారం ఈ ఎమ్మెల్యే లంతా 2023లో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగిసేంత వరకు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేసే వీలు ఉండదని వారి తరుపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్గతి కోర్టుకు తెలిపారు.

మరోపక్క ఖాళీ ఉన్న 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొందని, ఎన్నికలు నిలిపివేసేందుకు స్టే ఇవ్వకూడదని ఇసి తరుపు న్యాయవాది తెలిపారు. ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్‌ ఉత్తర్వు కారణంగా.. వీరు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కోల్పోకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనర్హత, ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై స్పష్టత నివ్వాలని స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాలను బిజెపి తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. కాంగ్రెస్‌, బిజెడిలు విడివిడిగా పోటీ చేస్తుండటం గమనార్హం.

Related posts