telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” బుల్లితెర రికార్డు

UU

సత్యదేవ్ హీరోగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. మ‌ల‌యాళ హిట్ మూవీ ‘మ‌హేశింతే ప్రతీకార‌మ్‌’‌ను తెలుగులో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ పేరుతో రీమేక్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని, విజ‌య ప్రవీణ ప‌రుచూరి నిర్మించారు. వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. జాతీయ అవార్డు గ్రహీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్రభాక‌ర్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ సినిమాను అరకు వ్యాలీలో కేవలం 36 రోజుల్లో చిత్రీకరించారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సినిమాను సినీ ప్రముఖులు కూడా చాలా బాగుందంటూ కొనియాడుతున్నారు. ఈ నెల 13న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీ మెయిన్ ఛానల్ లో సాయింత్రం ఆరు గంటలకి ఈ సినిమా ప్రసారం కానుంది. ఈటీవీ టెలికాస్ట్ చేస్తున్న కొత్త సినిమా కూడా ఇదే కావడం విశేషం.. ఇంతకుముందు తమ దగ్గర ఉన్న పాత సినిమాలనే తిప్పుకుంటూ వేస్తూ వచ్చింది. అయితే మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని కొత్త సినిమాల పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కంటెంట్ పరంగా చాలా కొత్తగా అనిపించిన ఈ చిత్రాన్ని బుల్లితెర ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా డైరెక్ట్ గా ధియేటర్ లో రిలీక్ కాకుండా టీవీలో రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం. ఈ సినిమాని అనధికారికంగా డౌన్ లోడ్ చేసి లోకల్ ఛానల్స్ వాళ్ళు ఇల్లీగల్ గా వేశారు. అయితే అలాంటి సంస్థలపై సదరు ఛానల్ సీరియస్ అయిందట. అలా ఈ నెల 13న సాయింత్రం ఆరు గంటలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ఈ సినిమా రేటింగ్స్ విషయంలో భారీ అంచనాలు ఉన్నాయి.

Related posts