telugu navyamedia
సినిమా వార్తలు

ఆక‌ట్టుకుంటున్న‌“పుష్ప” ఫస్ట్ సింగిల్ ప్రోమో ..

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న “పుష్ప సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమాలోని మొదటి సాంగ్ “దాక్కో దాక్కో మేక” అనే ఫస్ట్ సింగిల్ ను ఆగష్టు 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ తో పాటు సంగీతం దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా కన్పించారు. ఈ సాంగ్ మొత్తం 5 భాషల్లో రిలీజ్ కాబోతోందని ప్రోమోలో ప్రకటించారు. ఈ సాంగ్ తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటి నుంచే బన్నీ అభిమానులు ఈ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జ‌త‌గా ర‌ష్మిక‌ మందన్న నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే టీజర్ సోషల్ మీడియాలో దుమ్ముదులిపింది. ఇదిలా ఉండగా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ను డిసెంబర్ 25న విడుదల చేయగా.. రెండవ భాగం 2022లో అభిమానులు ముందుకు రానుంది.

Related posts