రియాలిటీ షో బిగ్ బాస్.. రెండు సీజన్స్‌లోను బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ “షో”కి తెలుగులో తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా ఉన్నాడు. అయితే ఇక సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుంది ? దానికి హోస్ట్ ఎవరు అనే దానిపై కొన్నాళ్ళుగా హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. మీలో కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోతో ఆకట్టుకున్న నాగార్జుననే బిగ్ బాస్ 3ని హోస్ట్‌గా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. “స్టార్ మా” ఇటీవల మొదటి ప్రోమోను విడుదల చేసింది. త్వరలో “బిగ్‌బాస్” ప్రారంభం కాబోతోందంటూ ఆ ప్రోమో ద్వారా స్పష్టం చేసింది. తాజాగా హోస్ట్‌ను కూడా రివీల్ చేసింది. అయితే హోస్ట్ విషయంలో సస్పెన్స్‌ను మెయిన్‌టైన్ చేసింది. హోస్ట్ ఫేస్‌ను చూపించకుండా ఈ ప్రోమోను కట్ చేశారు. ఈ ప్రోమోలో ఉన్న వ్యక్తి వాకింగ్ స్టైల్, ఫిజిక్‌ను చూసి హోస్ట్ నాగార్జునే అని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. మరి నాగార్జున ఈ షోను ఎంత రసవత్తరంగా నడిపిస్తారో చూడాలి.
అధికారంతో నడిపే శక్తి గల వ్యక్తి ఎవరు ?#BiggBossTelugu3..Coming Soon on @StarMaa pic.twitter.com/1gxgVmk92d
— STAR MAA (@StarMaa) 20 June 2019