విజయవాడ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎం ఏలిషా అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు ప్రక్రియ ఉచితంగా చేయనున్నట్టు వెల్లడించారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకొనే వారికి ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పారు. ఆధార్‌లో సవరణలకు రూ.50లు వసూలు చేస్తామని వ్యాఖ్యానించారు.
ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతీయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధాన పోస్టాఫీసల్లో ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని 59 కేంద్రాల్లో ఏటీఎం కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించారు. త్వరలో మరికొన్ని ఏటీఎంలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఏటీఎం కేంద్రాల్లో అన్ని కార్డులను ఉపయోగించుకోవచ్చునని చెప్పారు.
పోస్టాఫీసుల్లో అనేక రకాల సేవింగ్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రజలు సద్వినియోగించు కోవాలని సూచన. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం, ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా పథకం అందుబాటులో ఉన్నట్టు వెల్లడి.
ఈ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బే తగిలింది: నారా భువనేశ్వరి