telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

యూఎస్ కి వెళ్లాలంటే అది తప్పనిసరి…

corona america

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం అవుతూనే ఉంది… కోవిడ్ కేసులతో పాటు, మృతుల్లోనూ టాప్ స్పాట్‌లో ఉండడమే కాదు.. ఇప్పటికీ అక్కడ కేసులు తగ్గుముఖం పట్టడంలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు… ఇదే సమయంలో బ్రిటన్‌లో పురుడుపోసుకున్న కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను కలవరానికి గురిచేస్తోంది. భారత్‌ లాంటి దేశాలు బ్రిటన్‌కు విమాన సర్వీసులను కూడా రద్దు చేశాయి.. ఇక, కొత్త వైరస్‌ నేపథ్యంలో అప్రమత్తమైన అమెరికా.. యూకే నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమలులోకి రానుండగా.. కోవిడ్‌ నెగెటివ్ సర్టిఫికెట్ లేని వారని ప్రయాణానికి అనుమతించకూడదని విమానయాన సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్-19 విజృంభణ సమయంలో యూకేలో పర్యటించిన వారిపై అమెరికా ప్రభుత్వం మార్చిలో ప్రయాణ ఆంక్షలు విధించినట్టు ఈ సందర్భంగా సీడీసీ గుర్తు చేసింది. మరోవైపు.. అగ్రరాజ్యం కోవిడ్ పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్యలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts