telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ సమ్మెను .. అనుకూలంగా మార్చేసుకుంటున్న బీజేపీ.. వారిదే ‘హుజుర్’ ..

tsrtc protest turns huzurnagar to bjps

ఆర్టీసీ కార్మికుల సమ్మె రూపంలో అందించారు. సమ్మె నేపథ్యంలో తెలంగాణలో త్వరితగతిన చోటు చేసుకున్న పరిణామాలు ఈ ఉదాహరణను ఋజువుచేస్తున్నాయి. తెలంగాణా రాజకీయాల్లో చీమతల పట్టేంత చోటు ఇస్తే, అదే చివరకు అది కేసీఆర్ గారి టీఆరెస్ కొంపకే ఎసరు పెట్టెలా తయారయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా! అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ గెలుచుకున్న పార్లమెంట్ స్థానాలతో ఆ పార్టీలో పెరిగిన ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం అనంతం. తెలంగాణలో తిరుగు లేదనుకునే ‘బంగారు కుటుంబం ఆడపడుచు కవిత’ ను ఎన్నికల్లో ఓడించటం సాధారణ విషయం మాత్రం కాదు. ఆమెకు ధిమ్మ దిరిగి బొమ్మ కనిపించి తలబొప్పి కట్టింది. ఆ దెబ్బకు కనీసం ఈ సంవత్సరం బతకమ్మ పండగల్లో కూడా జనం ముందుకు కవితరాలేనంత పరిస్థితి తలెత్తింది.

భవిష్యత్తులో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయటానికి తమకు అవకాశం ఉందనే, రెట్టించిన ఆశావాదంతో ముందుకు సాగుతున్న కమలదళానికి – అప్పటి నుంచి సరైన అవకాశం కోసం మాటేసి ఎదురు చూసే వేళ “ఆర్టీసీ కార్మికుల సమ్మె” లాంటి బలమైన ఆయుధం చేజిక్కింది. ఆర్టీసీ కార్మికులకు తాము అండగా, ఆసరాగా ఉంటామని మద్దతిచ్చి వారు చేస్తున్న సమ్మెను ఒక ఉద్యమ స్థాయికి చేర్చటంలో బీజేపి పాత్ర చాలా ప్రశంసించ తగిందే! ఇప్పుడూ ఆ సమ్మె ఏకంగా పదిహేను రోజులు దాటింది, తెలంగాణా బంద్ దిగ్విజయం చేసుకుంది. ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ కార్మికులు ఇద్దరు తమ పట్టు, బెట్టును ప్రదర్శిస్తున్న వేళ, మొన్న శుక్రవారం “శేరిలింగంపల్లి నుంచి కుకటపల్లి” వరకూ బీజేపీ నిర్వహించిన “మోటార్ బైక్ ర్యాలీ తన జోరు” ను చూపించింది. అది చూసిన గులాబీ నేతలకు నోటమాట రాని పరిస్థితి.

హైదరాబాద్ నగరంలోనే కాదు సరిహద్దుల్లొ కూడా బీజేపీకి ఎంత పట్టుందో ఇప్పుడు నగర వాసులకు తేటతెల్లమైంది. “భారీ ఎత్తున సాగిన ఆ రాలీ చూసే అదొక విజయోత్సవమో? కౌముదీ మహోత్సవమో? అన్నంతగా ఆశ్చర్యచకితులను చేసింది. కనుచూపు మేరకు భారీ ఎత్తున బైకులతో ర్యాలీకి వచ్చిన వారితో బీజేపీ నేతలకు నూతన ఉత్సాహాన్ని పెంచింది. హైదరాబాద్ ఆ తరవాత తెలంగాణాని అజేయంగా స్వంతం చేసుకుందామను కుంటున్న బీజేపి, ఈ టిఎస్-ఆర్టీసీ కార్మికుల రాలీని ఆలంబన చేసుకుని భాగ్యనగరాన్ని కాషాయవర్ణంతో కప్పేసింది. బీజేపీ నిర్వహించే ర్యాలీకి ఇంత భారీ స్పందన ఉంటుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. ర్యాలీలో బీజేపీ కార్యకర్తలతో పాటు, ఆర్టీసీ కార్మికులు వందల సంఖ్యలో ఉండటంతో వాతావరణం ఒక్కసారి మారిపోయింది. “ఆర్టీసీ సమ్మె, తెలంగాణా బంద్” సంగతేమో కానీ, రాజకీయ సమీకరణాల్లో నూతన మార్పులు వస్తున్నాయన్నది కూకటపల్లిలో బహిర్గతమైంది.

Related posts