telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య సినిమాలో విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ?

Varalakshmi-Sarathkumar

నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రానికి సంబంధించిన పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 17న సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో త‌మిళ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ మరో విల‌న్‌గా న‌టిస్తుంద‌నే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ వార్తలపై స్పందించిన చిత్ర నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ “జ‌గ‌ప‌తిబాబుగారిని మా సినిమాలో విల‌న్‌గా అనుకున్న మాట వాస్త‌వ‌మే. మ‌రో విలన్ కూడా సినిమాలో ఉన్నారు కానీ.. ఆ పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ను తీసుకోవాల‌ని అనుకోలేదు” అని స్పష్టం చేశారు.

Related posts