telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

యువతిపై 139 మంది అత్యాచారం కేసులో కీలక నిర్ణయం

women abusing even in govt offices

గడిచిన తొమ్మిదేళ్లుగా తనపై అత్యాచారాలు జరుగుతున్నాయని, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా వారు లైంగికంగా వేధించారని, తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లీగల్ ఎక్స్ పర్ట్స్ సలహా లేకుండా ముందుకు వెళ్లరాదని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడు సమావేశం కానున్న ఉన్నతాధికారులు, డీజీపీ అనుమతిస్తే, సీఐడీ చేతికి కేసును ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలిని ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో ఉంచి, నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఆమె మానసిక ఒత్తిడితో ఉందని వెల్లడించిన ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, మహిళా అధికారుల సహాయంతో ఆమెను ప్రశ్నించి, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ఏసీపీని, ఆయనకు సహాయంగా నలుగురు ఇన్ స్పెక్టర్ల బృందానికి కేసును అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు చేసిన వారిలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఉండటమే ఇందుకు కారణం. అందరి దృష్టీ ఈ కేసుపై పడగా దర్యాఫ్తు అధికారిగా ఎవరిని ఉంచాలన్న విషయమై నేడు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

Related posts