telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్.. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టేది లేదు

సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలుంటేనే సర్పంచ్, ఎంపిపిలు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు ముఖ్యమంత్రికి గుర్తుంటారని.. స్థానిక సంస్థల అభివృద్ధికి ఒక్క పైసా కేసీఆర్ కేటాయించలేదని మండిపడ్డారు. రైతు వేదిక,శ్మశాన వాటికలు, ట్రాక్టర్ల డబ్బులు అన్ని కేంద్రానివేనని… స్థానిక సంస్థల కోసం కేంద్రం ఇచ్చే నిధులను ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపణలు చేశారు. గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఏమునుకుంటున్నారో ముఖ్యమంత్రి రిపోర్ట్ తెప్పించుకోవాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంపిపిలు, జెడ్పిటీసిలు, ఎంపిటిసిల పరిస్థితి దారుణంగా ఉందని…. గ్రామాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేశారా..? అని ప్రశ్నించారు. సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకుంటున్నారని.. తెలంగాణాలో భవిష్యత్తులో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తనను జైలుకు పంపొద్దని కేంద్రం వద్ద కేసీఆర్‌ పొర్లు దండాలు పెట్టుకున్నారని.. కేసీఆర్.. కేసీఆర్ కుటుంబాన్ని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. మెత్తబడి కేంద్ర పథకాలు అమలు చేస్తున్నారని.. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని కేంద్ర పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.  బుద్ధి, సిగ్గు ఉన్నవారు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Related posts