telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

30 రోజుల పాటు ఫ్రీ… రానా ఆఫర్ ఏమిటంటే…?

Rana

ప్రస్తుతం క‌రోనా భ‌యంతో స్కూల్స్‌, థియేట‌ర్స్‌, షూటింగ్స్‌, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. ఇప్పటికే షూటింగ్‌లు ఆగిపోయాయి. మరోవైపు సినీ సెలెబ్రిటీలు తమ అభిమానులకు కరోనా నుంచి ఎలా దూరంగా ఉండాలో సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న ‘అర‌ణ్య’ చిత్రం విడుద‌ల‌ను వాయిదా వేసిన హ్యాండ్‌స‌మ్ రానా ద‌గ్గుబాటి, సామాజిక దూరం పాటిస్తూ వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా చూడాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ఒక కానుక‌ను ఆఫ‌ర్ చేశారు. ఒక నెల రోజుల పాటు ఉచితంగా అమ‌ర్ చిత్ర క‌థ‌, టింకిల్ యాప్స్‌‌లోని కంటెంట్‌ను తిల‌కించ‌వ‌చ్చ‌ని హ్యాండ్‌స‌మ్ రానా ద‌గ్గుబాటి ప్ర‌క‌టించారు. ఆ రెండు యాప్స్ ఆయ‌న‌వే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఏసీకే (‎ACK Comics App) విష‌యంలో ఈ నెల‌లో ఆన్‌లైన్ స‌భ్య‌త్వాల‌ను మొద‌లు పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాం. కాబ‌ట్టి ఒక నెల రోజుల పాటు ఉచితంగా అమ‌ర్ చిత్ర క‌థ‌, టింకిల్ (Tinkle) యాప్స్‌ చూసుకోవ‌చ్చు. వాటిలో త‌మ‌కు ఇష్ట‌మైన దాన్ని చ‌దువుకోవ‌చ్చు. అందులోనివ‌న్నీ మ‌న ప్రాంతం క‌థ‌లు. అవి చ‌దివితే మ‌న దేశం, మ‌న దేవుళ్లు, రాజులు, సంస్కృతి గురించి తెలుస్తుంది. చ‌క్క‌ని బొమ్మ‌లు, క‌థ‌ల‌తో అవి అల‌రిస్తాయి. మ‌న గ‌తం గురించి తెలుసుకొని, భ‌విష్య‌త్తును నిర్మించుకోవ‌డానికి నేటి త‌రానికి ఇది చాలా ముఖ్యం” అని రానా చెప్పారు.

Related posts