telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బ‌న్నీ కాలికి ఆరో వేలు ఉండ‌టం వెనుక ట్విస్ట్…

pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. టైటిల్‌లో చేతి వేలి ముద్రలు కనిపిస్తుండగా బన్నీ కాలికి ఆరు వేళ్లు కనిపిస్తున్నాయి. బ‌న్నీ కాలికి ఆరో వేలు ఉండ‌టం వెనుక ఏదైనా ట్విస్ట్ ఉందా? అనే విష‌యం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది.

Related posts