నేటి నుండి హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో నూతన ఫ్లైఓవర్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. నేడు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలి, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమూద్ ఆలీ మాట్లాడుతూ, హైదరాబాద్ లోని అన్ని జంక్షన్లను అభివృద్ధి చేస్తామని, దశలవారీగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్ అభివృద్ధిలో ముందుందని అన్నారు.
తెలంగాణ బడ్జెట్లో వాస్తవాలు కనిపించడం లేదు: విజయశాంతి