telugu navyamedia
సినిమా వార్తలు

తుది శ్వాస విడిచిన ‘రామాయణ్’ వాలి, సుగ్రీవ పాత్రధారుడు

ramayan

1980ల్లోరామాయణ్ సీరియల్ గురించి తెలియని వాళ్లంటూ ఉండరు. దూరదర్శన్‌లో వచ్చిన ఈ సీరియల్ సంచలనాలకు కేంద్రబిందువు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన ఈ సీరియల్ అప్పట్లో 25 జనవరి 1987 నుంచి 31 జులై 1988 మధ్యలో 78 ఎపిసోడ్స్‌గా రామాయణ్ ప్రసారమైంది. అప్పట్లో ఇది చాలా ప్రాచూర్యం పొందింది. ఈ సీరియల్‌లో నటించిన వాళ్లంతా ప్రేక్షకులకు బాగా సుపరిచితులే. ఇందులో వాలి, సుగ్రీవుడు పాత్రలు పోషించిన శ్యామ్‌ సుందర్ కాలానీ మరణించారు. ఈయన కొన్నేళ్లుగా కాన్సర్‌తో పోరాడుతూ ఎప్రిల్ 7న తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్యామ్‌ సుందర్ మరణంపై రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్.. లక్ష్మణ్ పాత్ర పోషించిన నటుడు సునీల్ లాహ్రీ సంతాపం వ్యక్తం చేసారు.

Related posts